కర్నూల్ జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
ఇరు వర్గాల ఘర్షణ.. నలుగురికి గాయాలు - done latest news
కర్నూల్ జిల్లా దొరపల్లిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. వాహనం విషయంలో మొదలైన గొడవ.. ఘర్షణకు దారి తీసింది.
fight-
ఆటో రోడ్దుపై నిలిపిన విషయంలో మాటమాట పెరగడంతో అది ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. పోలీసులు ఘర్షణను అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారిని విచారించి కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి:అక్రమ మద్యం పట్టివేత... ఇద్దరు అరెస్టు