Two Farmers Died in Road Accident : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండించిన పంటను హిందూపూరం మార్కెట్ లో అమ్ముకొనేందుకు, బొలెరో వాహనంలో బయలుదేరిన రైతులు.. చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు రైతులు మృతి చెందారు. పాతచాములపల్లికి చెందిన రైతు మధు అక్కడికక్కడే మృతి చెందగా, మరో రైతు వెంకట్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోని దర్యాప్తు చేపట్టారు.
ఒకేరోజు మూడు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ :రాష్ట్రంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళ మెడలో బంగారు గొలుసుతో కనపిండితే చాలు.. అది ఎక్కడ పోతుందోననే ఆందోళన, సగటు మహిళలో నెలకొంది. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో.. వెంట వెంటనే గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో, ఒక్కరిద్దరే.. పక్కా స్కెచ్ తో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. వరుస ఘటనలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి భయాందోళనకు గురి అవుతున్నారు.