ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ విధులకు గైర్హాజరు... ఇద్దరు వైద్యులు సస్పెండ్ - kurnool collector suspends two doctors updates

కొవిడ్ విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులపై.. కర్నూలు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

collector suspend two doctors
ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసిన కలెక్టర్

By

Published : May 4, 2021, 3:04 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ విధులకు గైర్హాజరు అయిన ఇద్దరు సీనియర్ వైద్యులను సప్పెండ్ చేశారు. అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. ఎస్. సుధీర్ కుమార్, పీజీ డాక్టర్. బి. సురేష్ బాబు విధులకు హాజరుకానట్లు డ్యూటీ రిజిస్టర్ ద్వారా తెలుసుకున్నారు.

తక్షణమే ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ విధులకు హాజరుకాకుంటే సీనియర్ వైద్యులను సైతం ఉపేక్షించబోమనీ.. కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని కలెక్టర్ వీర పాండియన్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details