కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గురువారం రాత్రి ఆదోని శివారు నెట్టేకల్ క్రాస్ దగ్గర ఆగి ఉన్న టిప్పర్ను కారు ఢీకొంది. కారులోనే ఉన్న వీరభద్రప్ప అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా... టిప్పర్ మరమ్మతులు చేస్తున్న అవినాష్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. వైద్యులు సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్లే అవినాష్ మృతి చెందాడని...అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - ఆదోని వార్తలు
టిప్పర్ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు.
![రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి Two died in road accident at adhoni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8586266-12-8586266-1598591264726.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇవీ చదవండి:కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు