కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. బావమరిది పెళ్లికి వచ్చిన ఇద్దరు బావలు మృతి చెందారు. వరుసకు తోడల్లులు అయ్యే బాలరాజు, దిలీప్‌లు ఉదయం విద్యుద్ఘాతంతో మృత్యువాత పడ్డారు. బావమరిది పెళ్లి కోసం రెండు రోజుల క్రితమే వీళ్లు అత్తవారింటికి వచ్చారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
బావమరిది పెళ్లికి వచ్చి.. మృత్యువాత పడ్డ బావలు - two died
బావమరిది పెళ్లికి వచ్చిన బావలు విద్యుద్ఘాతంతో విగత జీవులుగా మారారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కపటి గ్రామంలో చోటు చేసుకుంది.
బావమరిది పెళ్లికి వచ్చి ఇద్దరు బావలు మృతి