కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జాతీయ రహదారి వంతెనపై గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. బేతంచెర్ల మండలానికి చెందిన దిలీప్‌కుమార్ నంద్యాల నుంచి తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ అక్కడికక్కడే మృతిచెందాడు.
వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి - two died in karnool road accident
కర్నూలు జిల్లా పాణ్యం, బ్రాహ్మణకొట్కూరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరులో ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాసులు మృతిచెందాడు. కర్నూలు వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్ని వెనుక వైపు బలంగా ఢీకొనడంతో పొలంలో ట్రాక్టర్ పల్టీలు కొట్టింది. ట్రాక్టర్ మీద పడటంతో శ్రీనివాసులు అక్కడిక్కడే మరణించాడు. కర్నూలు పోలీసులు లారీని పట్టుకున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలున్నారు.