కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పారహాలు గ్రామంలో విషాదం జరిగింది. గోడ కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు… భీమన్న గౌడ్ అనే వ్యక్తి ఇల్లు ఓ వైపు కూలిపోయింది. దానిని మరమ్మతులు చేస్తుండగా ఘటన జరిగింది.
ఇంటి మరమ్మతులు చేస్తుండగా కూలిన గోడ.. ఇద్దరి మృతి - గోడ కూలి ఇద్దరు మృతి వార్తలు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పారహాలు గ్రామంలో గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన లక్మన్న, పెద్ద హరివణంకు చెందిన గంగమ్మ మరణించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.