కర్నూలు జిల్లాలోని హోళగుందకు చెందిన గౌనీ, నాయుడు అనే ఇద్దరు అన్నదమ్ములు పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. నగదు కోసం నేరాల బాట పట్టిన వీరిపై... దొంగతనం, హత్య కేసులున్నాయి. జిల్లాలోని డోన్, ఓర్వకల్లు, కృష్ణగిరి, ఉలిందకొండ పోలీస్స్టేషన్లతో పాటు... ఇతర జిల్లాల్లోనూ వీరిపై కేసులున్నాయి. హాత్యకేసు విచారణ వాయిదా పడటంతో... కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా గార్గేయపురం సమీపంలో తప్పించుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కళ్ళు కప్పి ఇద్దరు ఖైదీలు పరార్ - కర్నూలు నేర వార్తలు
ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన... కర్నూలు జిల్లా గార్గేయపురంలో జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పరారైన ఇద్దరు నిందితులు