Two Constables Died In Road Accidents: ప్రజల భద్రతలో వాళ్లు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రాణాలు సైతం విడుస్తుంటారు. అలాంటి ఘటనలే రాష్ట్రంలో జరిగాయి. ఆయా ప్రమాదాల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు విడిచారు. ఒక ప్రమాదం కర్నూలు జిల్లాలో జరగగా.. మరొకటి విశాఖ జిల్లాలో జరిగింది.
మద్యం తరలిస్తున్నవారిని పట్టుకుంటుండగా : కర్నూలు సమీపంలోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సై జిలాని భాషా, కానిస్టేబుల్ అన్వర్ భాషాకు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు మద్యం తీసుకొని వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వారు అప్రమత్తమై పంచలింగాల చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. వారు ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లారు. దీంతో వారిని పట్టుకునేందుకు ఎస్సై జిలాని భాషా, కానిస్టేబుల్ అన్వర్ భాషాలు ద్విచక్రవాహనంపై వారిని వెెంబడించే క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ అన్వర్ భాషా అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని.. అలాగే జరిగిన దానిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని తాలూకా సీఐ రామలింగయ్య తెలిపారు.