పిడుగుపాటుతో తల్లి మృతి చెందిన ఘటనలో ఆమె పిల్లలు అనాథలయ్యారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం గుంటూరుకు చెందిన శాంతకుమారి.. 10 బొల్లవరంలోని అక్క చింతామణి ఇంటికి వెళ్ళింది. వారిరువురూ పొలంలో కూలీలతో కలిసి పనిచేస్తుండగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం పెద్దది కావడంతో రోడ్డుపై ఉన్న ఆటో వద్దకు వస్తుండగా.. పిడుగుపాటుకు శాంతకుమారి కుప్పకూలిపోయింది. అక్క చింతామణి, మిగతా కూలీలు ఆమె దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది.
ఇదీ చదవండి:ఐసీయూలో ఆగిన విద్యుత్.. కరోనా రోగుల ఉక్కిరిబిక్కిరి