కర్నూలు జిల్లా డోన్ పట్టణం నెహ్రూ నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో గతంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు(Two accused arrested in ATM theft case at done) చేశారు. ఆగస్టు 30న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏటీఎం మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ. 65,21,900 నగదు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టోల్ గేట్ సీసీ కెమెరాలు, పట్టణంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
arrest: ఏటీఎంలో చోరీ కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్.. - Two accused arrested in ATM theft case
కర్నూలు జిల్లా డోన్‌లో ఆగస్టు 30న ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ చేసినట్లు(Two accused arrested in ATM theft case at done) డోన్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
హరియాణా రాష్ట్రానికి చెందిన చోరీ ముఠా.. ఈ దొంగతనం చేసినట్లు గుర్తించామని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 'ముఠా నాయకుడు ఫరూక్‌తో సహా ఐదుగురు ఈ చోరీలో పాల్గొన్నారు. ఫరూక్, ఆరిఫ్, ఇమ్రాన్, హసన్, ముస్తకిం.. నంబరు ప్లేట్ లేని కారులో వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు(ATM theft case at done). ఈ పని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. ఫరూక్ గతంలోనూ అనేక కేసుల్లో ప్రధానంగా నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్ మోహిదీపట్నంలో ఆరిఫ్, ఇమ్రాన్‌ను సోమవారం అరెస్ట్ చేసి వాళ్ల వద్ద నుంచి రూ. 6 లక్షల 25వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ వివరించారు.
ఇదీ చదవండి..:ACCIDENT: జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా...