తెలంగాణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,09,997 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ జలాశయ 12 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా పులిచింతలకు 1,78,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తి పులిచింతలకు నీటి విడుదల - పులిచింతల జలాశయం వార్తలు
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,09,997 క్యూసెక్కుల నీరు చేరడం వల్ల సాగర్ జలాశయ 12 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్
సాగర్ నుంచి ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని కిందకు పంపిస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 590 అడుగులకు ప్రస్తుతం 589.50 అడుగుల మేర నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 310.55 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.
- ఇదీ చూడండి :ఏపీలో ఎక్కడా బొగ్గు గని లేదు: కేంద్రం