తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైనప్పటికీ పలుచోట్ల స్నానఘట్టాలు, రహదారులు, మౌలిక వసతుల ఏర్పాట్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సకాలంలో వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మొత్తం 336 పనులకు రూ.232 కోట్లకుపైగా కేటాయించారు. గత అక్టోబరు 21న టెండర్లు పిలిచినప్పటికీ పనులు అప్పగించేసరికి వారానికిపైగా పట్టింది. తక్కువ సమయం ఉండటం, రోడ్ల పనులు దక్కించుకున్న గుత్తేదార్లకు కంకర సమస్యతో పనులు ముందుకు సాగలేదు. నవంబరు15 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పురోగతి లేదు. కర్నూలు నగరంలోని నాగసాయి, మంత్రాలయం, నాగులదిన్నె, గురజాల, పంచలింగాల, మునగాలలో ఇప్పటికీ పనులు చేపడుతూనే ఉన్నారు. రహదారుల పనులు కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉండటంతో వాహనాల్లో వచ్చే భక్తులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా కోడుమూరు, సి.బెళగల్ నుంచి కొత్తకోట, గుండ్రేవుల ఘాట్లకు వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చింది. మంత్రాలయం సంతమార్కెట్, పంచలింగాల, కొత్తకోట, నాగులదిన్నె ఘాట్ల వద్ద ఆగమేఘాలపై సిమెంటు రహదారులు వేశారు. పంచలింగాల, మునగాల ఘాట్ల రహదారి పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు - తుంగభద్ర పుష్కరాల వార్తలు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైయ్యాయి. అయితే సకాలంలో వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. తక్కువ సమయం ఉండటం, రోడ్ల పనులు దక్కించుకున్న గుత్తేదార్లకు కంకర సమస్యతో పనులు ముందుకు సాగలేదు.
Tungabhadra pushkaralu
కర్నూలు జిల్లా అధికారుల కోరిక మేరకు తుంగభద్ర జలాశయం నుంచి నదికి శుక్రవారం నుంచి 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు ఇంకా జిల్లాకు చేరలేదు.
ఇదీ చదవండి:ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు శ్రీకారం