సోమవారం తెల్లవారుజాము నుంచి తుంగభద్ర నది మెరిసింది. కర్నూలు జిల్లాలో తంగభద్ర పుష్కరాలు నాలుగవ రోజు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో.. సంకల్‌భాగ్ ఘాట్ వద్ద భక్తుల సందడి ఎక్కువగా ఉంది. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి.. నదిలో దీపాలు వదిలారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పుష్కరాల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించే విధంగా నియమాలను పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.