ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవంబరులో తుంగభద్ర పుష్కరాలు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - tungabadra river pushkaralu news

ఈ ఏడాది నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ పక్కీరప్ప పరిశీలించారు.

నవంబరులో తుంగభద్ర పుష్కరాలు..ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
నవంబరులో తుంగభద్ర పుష్కరాలు..ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

By

Published : Jun 16, 2020, 5:54 PM IST

నవంబరులో తుంగభద్ర నదికి పుష్కరాలు రానుండటంతో కర్నూలు ఎస్పీ పక్కీరప్ప జిల్లాలో ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాలు నవంబర్ 20 నుంచి డిసెంబరు 1 వరకు రానున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నది పరివాహక ప్రాంతంలో ఘాట్ల ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు. పంచలింగాల ఘాట్, పంప్​హౌస్ ఘాట్​తో పాటు మంత్రాలయంలో ఉన్న తుంగభద్ర నదిని ఆయన పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా మంత్రాలయం దేవస్థానంలో రోజుకు లక్ష మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూం, కొత్తగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకోవాలని అక్కడి అధికారులకు ఎస్పీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details