తుంగభద్ర పుష్కరాలు కర్నూలులో ఐదో రోజూ కొనసాగుతున్నాయి. నగరంలోని సంకల్ బాగ్ ఘాట్లో భక్తులు పలుచగా కనిపించారు. మిగిలిన ఘాట్లన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి. నాలుగు రోజులుగా నదిలో తగిన స్థాయిలో నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు నదిలో నీటిమట్టం పెరిగేలా చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్లు ఖాళీగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసు సిబ్బంది ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు.
ఖాళీగా పుష్కరఘాట్లు.. ఫోన్లతో సిబ్బంది కాలక్షేపం - తుంగభద్ర పుష్కరాల అప్డేట్స్
తుంగభద్ర పుష్కరాల ఘాట్లు వెలవెల బోతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో తక్కువ సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. చేసే పనిలేక సిబ్బంది ఫోన్ల్తో కాలక్షేపం చేస్తున్నారు.
tungabadhra puskar ghats empty