తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మంత్రాలయంలోని తుంగభద్ర పుష్కర స్నానాలకు రెండో రోజు ఉదయం భక్తులు తరలివచ్చారు. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు తీర్థ పుణ్యస్నానాలు ఆచరించారు.
మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి - తుంగభద్ర పుష్కరాల తాజా వార్తలు
మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు తీర్థ పుణ్యస్నానాలు చేశారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు.
tungabadhra pushkara at manthralayam
కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. మంత్రాలయంలోని వినాయక ఘాట్, సొంతం మార్కెట్ ఘాట్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ ఘాట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు