పురాతన రామాలయాన్ని దర్శించుకున్న చినజీయర్ స్వామీజీ - చినజీయర్ స్వామీజీ తాజా న్యూస్
కర్నూలు జిల్లా ఆదోనిలోని పురాతన రామాలయాన్ని చినజీయర్ స్వామీజీ దర్శించుకున్నారు. ప్రాచీన ఆలయాలను కాపాడుకోవాలని భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా స్వామీజీని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలంలోని వందల ఏళ్ల నాటి రాముని దేవాలయాన్ని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామీజీ దర్శించుకున్నారు. నక్షత్ర ఆకారంలో ఉన్న సీత రాముల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాలని భక్తులకు సూచించారు. అలా చేయకపోతే చరిత్రహీనులుగా మిగిపోతామని అన్నారు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని సందేశం ఇచ్చారు. ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.