కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విగ్రహం వద్ద మెట్లు లేకపోవటంతో... పూలమాలలు వేసేందుకు ఎమ్మెల్యే, అధికారులు, దళిత సంఘాల నాయకులు ఇబ్బందులు పడ్డారు. దళిత సంఘాల నాయకుల డిమాండ్ మేరకు వచ్చే ఏడాది జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మెట్లు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు - nandhyala latest news
భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద మెట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

నంద్యాలలో బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు