కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామంలో స్థానిక యువకులు రహదారికి అడ్డంగా చెట్లు నరికి వేశారు. గ్రామానికి సమీపంలో కరోనా మృతులను ఖననం చేస్తారనే ఊహాగానాలతో భయభ్రాంతులకు గురై స్థానికులు... ఈ చర్యలకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులకు అవగాహన కల్పించి చెట్లను తొలగించారు. ఇలాంంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా భయంతో రహదారికి అడ్డంగా చెట్లు - కర్నూలు జిల్లాలో కరోనా ప్రభావం
కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కర్నూలు జిల్లా బానుముక్కలలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తారన్న ఊహాగానాలతో భయాందోళనకు గురైన గ్రామస్థులు... రహదారికి అడ్డంగా చెట్లు వేశారు.
కరోనా భయంతో రహదారికి అడ్డంగా చెట్లు