ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No Transport to students: బస్సులు లేక.. ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణం - కౌటాల విద్యార్థుల కష్టాలు

transportation problems for School students: సరైన రవాణా లేక విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కిలో మీటర్లు నడిస్తే గానీ.. విద్యార్థులు బడికి చేరుకోలేని పరిస్థితి ఉంది.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో ఇదీ పరిస్థితి. బస్సు ఉన్నా.. అది మధ్యాహ్నం వస్తుండటంతో విద్యార్థులు ప్రమాదకరంగా ఆటోలపై కూర్చుని ప్రయాణిస్తున్నారు.

transportation problems for School students in kautala in kurnool
ప్రమాదకరంగా ఆటోపై కూర్చుని బడికి వెళుతున్న విద్యార్థులు

By

Published : Dec 1, 2021, 10:06 AM IST

transportation problems: ఏళ్లు గడుస్తున్నా.. గ్రామీణ విద్యార్థుల బడి కష్టాలు తీరడం లేదు. కిలో మీటర్లు నడిస్తే గానీ బడికి చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు సరైన దారులు లేకపోవడం.. ఉన్న మార్గాల్లో బస్సు సదుపాయం లేకపోవడంతో వారి కష్టాలు తీరడం లేదు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. 40 మంది విద్యార్థులు ఉదయాన్నే 4 కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లాలి. కానీ బస్సు మధ్యాహ్నం వస్తుంది. దీంతో చేసేది లేక.. హాల్వి ఉన్నత పాఠశాలకు కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు ప్రమాదకరంగా ఆటోపైన ఎక్కి వెళ్తున్నారు.

ప్రతిరోజూ ఇదేవిధంగా ప్రయాణిస్తుండటంతో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో బస్సులు ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details