శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనానికి వచ్చిన యువకులపై దాడి చేశారని ఆరోపణలు రావడంతో దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టి. శ్రీనివాసరావును అన్నదాన విభాగానికి బదిలీ చేస్తూ ఈవో రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి హెడ్ కానిస్టేబుళ్లు దాసు, రామకృష్ణను ఆత్మకూరుకు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. నేరుగా శ్రీశైలం వచ్చిన భక్తులను ఉచిత దర్శనానికి అనుమతించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆన్లైన్లో టికెట్ ఉన్నవారిని మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శ్రీశైలం దేవస్థానంలో దురుసుగా ప్రవర్తించిన అధికారి బదిలీ - Transfer of misbehaving Srisailam temple official
శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనానికి వచ్చిన యువకుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేస్తూ ఈవో రామారావు ఆదేశాలు జారీ చేశారు.
దురుసుగా ప్రవర్తించిన శ్రీశైలం దేవస్థానం అధికారి బదిలీ