కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టరు రమణయ్య అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులకు సూచించారు. అందుకోసం జిల్లాలో బర్డ్ ఫ్లూ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్డ్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈయనతో పాటు డీడీ, ఏడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి' - కర్నూలులో బర్డ్‌ఫ్లూ పై శిక్షణా కార్యక్రమం న్యూస్
కర్నూలు జిల్లా నంద్యాల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టరు రమణయ్య పాల్గొన్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులకు సూచించారు.
'బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి'