ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయం ఘాట్ రోడ్డుపై.. నిలిచిన వందల వాహనాలు - Srisailam Reservoir updates

traffic jam
ట్రాఫిక్ జామ్

By

Published : Aug 1, 2021, 4:15 PM IST

Updated : Aug 1, 2021, 5:32 PM IST

16:11 August 01

ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయం ఘాట్ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఘాట్ రోడ్డుపై వాహనాలు కదిలేందుకు గంటల సమయం పడుతోంది. ఓ వైపు డ్యాం అందాలను చూసేందుకు పర్యాటకులు తరిలి వెళ్తుండగా.. మరోవైపు నుంచి  శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు రావటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. శ్రీశైలం - హైదరాబాద్ రోడ్డుపైకి అడ్డదిడ్డంగా వాహనాలు రావటంతో ఈ సమస్య ఏర్పడింది.

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులు ఉండగా.. శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.

ఇదీ చదవండి:

శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ

Last Updated : Aug 1, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details