కరోనా నివారణపై కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్బాషా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆటో నడిపేప్పుడు ముందు సీట్లో ఎవర్నీ కూర్చోనివ్వద్దని సూచించారు. ఆటోలో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని డీఎస్పీ అన్నారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను అరికట్టవచ్చన్నారు. శానిటైజర్ కచ్చితంగా ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
కరోనా నివారణపై ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ డీఎస్పీ అవగాహన - corona updates at karnool
కర్నూలులో కరోనా నివారణపై ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్బాషా అవగాహన కల్పించారు. కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. ఆటోలో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకువాలన్నారు.
కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ అవగాహన కార్యక్రమం
ఇదీ చదవండి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్