కర్నూలు జిల్లా డోన్‌లో ట్రాక్టర్ యజమానులు నిరసన చేశారు. వాగులు, వంకల్లో ఉన్న ఇసుకను తరలిస్తుంటే అధికారులు జరిమానాలు వేస్తున్నారని వాపోయారు. నాలుగు రోజులుగా చేస్తున్న వీరి ఆందోళనకు తెదేపా డోన్ నియోజకవర్గ భాద్యుడు ప్రతాప్ సంఘీభావం తెలిపారు. డోన్ సమీపంలో ఇసుక రీచ్‌లు లేకపోవటంతోనే వాగుల్లో ఇసుకను తరలించాల్సి వస్తోందని ప్రతాప్ చెప్పారు.
డోన్‌లో ట్రాక్టర్ యజమానుల ఆందోళన - డోన్‌లో ట్రాక్టర్ యజమానుల ఆందోళన
కర్నూల్ జిల్లా డోన్‌లో ట్రాక్టర్ల యజమానులు ఆందోనకు దిగారు. అక్రమ ఇసుక రవాణా పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసన చేస్తున్న ట్రాక్టర్ యజమానులు