ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు - ఆటో ట్రాక్టర్ ఢీ లేటెస్ట్ న్యూస్

ఎదురుగా వస్తున్న ఆటోను.. ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు. ఆటోలో ప్రయాణం చేస్తున్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు

By

Published : Apr 22, 2021, 8:01 AM IST

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్ల పల్లె చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో వీరయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ ట్రాక్టర్ తాడిపత్రి వైపు నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ఉన్న రామలక్ష్మికి స్వల్ప గాయలయ్యాయి. మృతుడి భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details