ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం - కర్నూలులో అగ్ని ప్రమాదం తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40 వ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం సంభవించి. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్ నుంచి డీజిల్ లీక్ అవ్వడం.. క్షణాల్లో మంటలు వ్యాపించి.. వరి గడ్డితో సహా ట్రాక్టర్ కాలిపోయింది.

tractor fire accident on allagadda in kurnool national highway 40
కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం

By

Published : Jan 27, 2020, 11:37 PM IST

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను... లారీ వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో... ఇంజిన్‌ నుంచి డీజిల్‌ లీకై క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పూర్తిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో... వరిగడ్డితో సహా ట్రాక్టర్‌ దగ్ధమైంది. జాతీయ రహదారి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నంద్యాల నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరిగడ్డి రుద్రవరం మండలం ఎర్ర గుడి దీన్నే గ్రామానికి చెందిన గోపి రెడ్డి కాగా.. ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భాధిత రైతు వాపోతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details