ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందికొట్కూరులో బొమ్మలకొలువు - శారదా నవరాత్రులు

దసరా నవరాత్రుల వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులోని ఓ మహిళ తన ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. పదేళ్లుగా ప్రతీ శరన్నవరాత్రుల్లో ఇలా ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

toys exhibition in Nandikotkur
నందికొట్కూరులో బొమ్మలకొలువు

By

Published : Oct 23, 2020, 1:56 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు రావు పేట కాలనీలో నివాసముంటున్న ప్రసన్న లక్ష్మి. గత పదేళ్లుగా ప్రతీ నవరాత్రుల్లో ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఏడాది అరుణాచల లింగేశ్వరుడు, కనకధార స్తోత్రం సంబంధించి బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు వివరించారు. రోజూ స్థానికులను పిలిపించి కనకధారా స్తోత్ర పారాయణం, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details