కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు కూడా టమాట ధరలు పతనమయ్యాయి. నిన్న ధర లేకపోవటంతో అన్నదాతలు టమాటను మార్కెట్లోనే పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు అదే పరిస్థితి నెలకొంది. కనీసం కోత కూలీలు, రవాణా ఛార్జీలు కూడా రాకపోవటంతో... తమ పంటను మార్కెట్లో పారబోసి వెళ్లిపోయారు. ఈ విషయం పై తెదేపా, సీపీఐ నాయకులు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం టమాటలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రోజు రోజుకు పడిపోతున్న టమాట ధర... - పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు
కర్నూలులో టమాట ధర నేలను తాకుతోంది. ఎంతో కష్టించి పండించిన అన్నదాతకు పెట్టుబడి కూడా దక్కటం లేదు. పతనమౌతున్న ధరలకు విసుగు చెందిన అన్నదాత.. టమాట పంటను మార్కెట్లో పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
![రోజు రోజుకు పడిపోతున్న టమాట ధర... Tomato prices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9993434-851-9993434-1608820150795.jpg)
పడిపోతున్న టమాటా ఖరీదు
Last Updated : Dec 24, 2020, 9:47 PM IST