Tomato Farmers in Kurnool: టమాటా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు మార్కెట్లో టమాటా కేజీ నాలుగు రూపాయల ధర పలుకుతుండటంతో.. వాటిని రోడ్డుమీద పారబోసి నిరసన తెలిపారు. రైతుల ప్రభుత్వమని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.. తాము పండించిన పంటలకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించటం లేదని వారు ప్రశ్నించారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
కిలో టమాటా రూ.4.. గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన - కర్నూల్లో కలెక్టరేట్ ముందు టమాటా రైతుల ఆందోళన
Tomato farmers in AP: టమాటా పంటకు గిట్టుబాటు ధర లేదంటూ కర్నూలు జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. టమాటా కేజీ నాలుగు రూపాయల ధర పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే జగన్.. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు.
కర్నూలు జిల్లా రైతుల ఆందోళన