కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకల రేపుతున్నాయి.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బులెటిన్‌లో 31 మందికి పాజిటివ్ ఉన్నట్లుగా ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 234కు చేరింది. వీరిలో ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ మేరకు జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటి వరకూ నలుగురు డిశ్చార్జీ కాగా.. మరో 223 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి రోజురోజు విజృభిస్తుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
కర్నూలులో విజృభిస్తున్న కరోనా.. నేడు 31 కేసులు - ఏపీలో కోవిడ్-19 కేసులు
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ.. ప్రజల్ని తీవ్రంగా భయపెడుతోంది. నేడు జిల్లాలో 31 కేసులు నమోదు కావడంతో.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
today 31 cases registered and total corona cases rises to 234 in kurnool