జీతాలు ఇవ్వాలని.. ఆస్పత్రి సెక్యూరిటీ ధర్నా - సెక్యురిటీ సిబ్బంది
కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
సెక్యురిటీ ధర్నా
కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా జీతాలు లేవని..ప్రతిసారి జీతాల కోసం ధర్నా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బకాయి జీతాలను ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆసుపత్రిలో సేవలను అడ్డుకుంటామన్నారు.