ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రీకొడుకుల్ని కలిపిన టిక్ టాక్ - tik tok news ap

టిక్​ టాక్​ యాప్​ ప్రస్తుతం అందరిని ఉర్రూత్తలుగిస్తోంది. చిన్న పిల్లలు మెుదలు పండు ముసలి వరకు అందరూ టిక్​ టాక్​లో జోరుగా వీడియోలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఈ యాప్​ ఎంటర్​టైన్​మెంట్​ను పంచటంతో పాటు విడిపోయిన బంధాలను కలుపుతుంది. అదేంటో మీరే చూడండి.

tik-tok-together-father-and-son-in-kurnool
tik-tok-together-father-and-son-in-kurnool

By

Published : Mar 3, 2020, 6:12 AM IST

Updated : Mar 3, 2020, 7:36 AM IST

కుటుంబానికి దూరంగా జీవిస్తున్న తండ్రిని కొడుకుల చెంతకు చేర్చింది టిక్‌టాక్‌ యాప్‌. ఇంట్లో గొడవల వల్ల కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పుల్లయ్య భార్య, పిల్లలను ఆరేళ్ల కిందట వదిలి వెళ్లిపోయాడు. చాలా చోట్ల వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో పుల్లయ్య కుమారుడు నరసింహులు టిక్‌టాక్‌పై ఉన్న మక్కువతో తన తండ్రిని తలుచుకుంటూ ఓ వీడియో చేసి యాప్‌లో ఉంచాడు. ఆ టిక్‌టాక్‌ వైరల్‌గా మారి చివరికి తండ్రి పుల్లయ్య దృష్టిలో పడింది. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తన సమాచారం తెలిపాడు. గుజరాత్‌లోని గాంధీ దామ్‌లో జోన్‌ బట్టల కంపెనీలో లోడర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. తండ్రి గుజరాత్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఇద్దరు కుమారులు గుజరాత్‌కు వెళ్లి తండ్రిని కలుసుకున్నారు. త్వరలో నంద్యాలకు రానున్నారు.

Last Updated : Mar 3, 2020, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details