ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరి వాయిస్ ఐనా పట్టేస్తా... టిక్ టాక్​లో పెట్టేస్తా...! - tik tok surya news in telugu

ఆర్థిక ఇబ్బందులతో డిగ్రీ ద్వితీయ సంవత్సరం వరకు కష్టంగా చదివిన ఓ యువకుడు చదువు మానేసి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచాడు. తమకున్న పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. వాటితో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తూనే... తనలోని మిమిక్రీ కళకు పదును పెడుతున్నాడు. అతి తక్కువ సమయంలో 'టిక్ ​టాక్​' యాప్​లో లక్షల కొద్ది అభిమానులను సంపాదించుకున్నాడు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/17-December-2019/5405327_295_5405327_1576604065592.png
మిమిక్రి ఆర్టిస్ట్ టిక్ టాక్ సూర్య

By

Published : Dec 17, 2019, 11:24 PM IST

మిమిక్రి ఆర్టిస్ట్ టిక్ టాక్ సూర్య

అతడి ప్రతిభకు పేదరికం అడ్డు కాలేదు. ఆర్థిక ఇబ్బందులతో డిగ్రీ ద్వితీయ సంవత్సరం వరకు చదివిన ఆ యువకుడు చివరికి చదువు మానేసి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచాడు. తమకున్న పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. వాటితో పాటుగా పాడి అభివృద్ధి కోసం జెర్సీ జాతికి చెందిన 4 గేదెలను పెంచుతున్నాడు. వందకు పైగా కోళ్లను, పొట్టేళ్లను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తూనే... తనలోని మిమిక్రీ కళకు పదును పెడుతున్నాడు. కర్నూలు జిల్లా మద్దికేర మండలంలోని పెరవలి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు సూర్య. సినీ నటులు, ప్రముఖుల గొంతును అనుకరిస్తూ వారిలా హావభావాలు పలికిస్తూ మిమిక్రీలో రాణిస్తున్నాడు.

ఇప్పటికే సూర్య మిమిక్రీ వీడియోలు చూసినవారు అతడికి అభిమానులుగా మారుతున్నారు. సూర్య 'టిక్ టాక్' వీడియోలకు మిలియన్ల లైకులు రావటంతో పాటు, 2 లక్షల 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రముఖ సినీ నటుల స్వరాన్ని అనుకరించడంలో సూర్య ప్రతిభ చాటుకుంటున్నాడు. గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి జాతర... ఇతర పండగ సమయాల్లో ఆ యువకుడి ప్రదర్శనలను ఏర్పాటు చేసి స్థానికులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా, టీవీ రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు.. గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అదే తన లక్ష్యంమని అంటున్నాడు సూర్య.

ABOUT THE AUTHOR

...view details