ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కెమెరాకు చిక్కకుండా.. అధికారులే ఆశ్చర్యపడేలా..! - tiger

నల్లమల అడవుల్లో రెండు పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 20 పెద్ద పులులు ఉండగా.. వీటికి రెండు పిల్లలు తోడయ్యాయి. వీటిని పర్యవేక్షించేందుకు అటవీశాఖ 45 కెమెరాలు అమర్చింది. ప్రమాదం ఉంటుందేమోనని పెద్దపులి పిల్లల్ని కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

tiger

By

Published : Nov 3, 2019, 8:29 AM IST

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 20 పెద్ద పులులు ఉండగా.. వీటికి రెండు పులి పిల్లలు జత కలిశాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రకృతి పర్యాటక ప్రాంతమైన ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్రాంతంలో తల్లి పులితో కలిసి రెండు పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్రాంతంలో తల్లి పులి ఎక్కువగా కన్పిస్తున్న కారణంగా.. అటవీశాఖ దానికి ‘ఫర్హా’ అనే పేరు పెట్టింది. ఏడాది క్రితం దీనికి పుల్లాయిపల్లి బేస్‌క్యాంప్‌ ప్రాంతంలో రెండు పిల్లలు పుట్టాయి. అక్కడ బౌరమ్మ గుడి ఉంది. దీంతో మగ పులికూనకు పుల్లయ్యగా, ఆడ కూనకు బౌరమ్మగా నామకరణం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు అటవీశాఖ 45 కెమెరాలు అమర్చింది. కొన్నాళ్లపాటు కెమెరాల కంటపడిన అవి.. తర్వాత కన్పించకపోయేసరికి అధికారులు కలవరపడ్డారు. కెమెరాల ముందు ఏదైనా జీవి కదిలితే ఫ్లాష్‌ వచ్చి ఆ చిత్రం నిక్షిప్తమవుతుంది. ఫ్లాష్‌ను చూసి ఏదో ప్రమాదం ఉందన్న భావనతో పెద్దపులి.. పిల్లలు కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details