ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంప్రదాయ పూజలైనా, పిండ ప్రదానాలైనా ‘ఈ-టికెట్‌’ తప్పనిసరి - తుంగభద్ర పుష్కరాలు తాజా వార్తలు

తుంగభద్ర పుష్కరాల్లో ‘ఈ-టిక్కెట్‌’కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా.. ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలు, పిండ ప్రదానాలు దేనికైనా టిక్కెట్‌ ఉంటేనే అనుమతిస్తామంటూ కర్నూలు కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టంచేశారు.

thungabadra
thungabadra

By

Published : Nov 14, 2020, 9:18 AM IST

తుంగభద్ర పుష్కరాల్లో ‘ఈ-టిక్కెట్‌’కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొవిడ్ నిబంధనల దృష్టా.. ఘాట్ల వద్ద సాంప్రదాయ పూజలకు అనుమతింటడంలేదు. పుణ్య స్నానాలపై నిషేధం ఉందని, పిండ ప్రదానాలు చేసిన వారికి సైతం నదిలో మునకకు అనుమతి లేదన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ను ఈనెల 16, 17 తేదీల్లో ఇంటర్నెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. పుణ్యక్రతువులకు వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారినే ఘాట్ల వద్దకు అనుమతిస్తారు. ఇలా బుక్‌ చేసుకున్న భక్తులు... చరవాణిలో వచ్చిన సందేశంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పిండ ప్రదానం చేసే భక్తులకు నదిలోకి కేవలం రెండు అడుగుల వరకు నీటిలోకే అనుమతిస్తారు. అక్కడే వాటిని వదిలి తలపై నీళ్లు చల్లుకుని వెనక్కి రావాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details