కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో అవుకు, ఓర్వకల్లు, సంజామల, మద్దికెర, వెలుగోడు, బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాల ధాటికి వృక్షాలు నేలకూలాయి. గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. డోన్‌లో చెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి. సంజామల మండలం మిక్కినేనిపల్లెలో పొలం పని నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై రష్మీ అనే యువతి మృతిచెందింది. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న షెడ్ల తాలుకా పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. రైతుల గడ్డివాములు ధ్వంసం అయ్యాయి.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు - kurnool district latest news
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా డోన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పట్టణంలోని కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది.
![కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11479654-652-11479654-1618948389845.jpg)
పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం
Last Updated : Apr 21, 2021, 5:02 AM IST