ఆడ పిల్లలపై అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు (Women Protection Acts) చేసినా..ఫలితం లేకుండా పోతుంది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట పసిపిల్లలు మెుదలుకొని పండు ముసలి వరకు అత్యాచారానికి (Rape) గురవుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు (Kurnool) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని ముక్కుపచ్చలారని ఓ ముడేళ్ల చిన్నారిపై (Girl) కామంతో కళ్లు మూసుకుపోయిన 13 ఏళ్ల బాలుడు (Boy) మృగంగా మారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యం
బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లటాన్ని గమనించి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిపై అఘాయిత్యానికి (Rape) పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయటంతో కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వచ్చి చూడగా బాలిక తీవ్ర రక్త స్రావంతో ఏడుస్తూ ఉంది. చికిత్స కోసం చిన్నారిని వెంటనే ఎమ్మిగనూరు ఆస్పత్రికి (Hospital) తరలించారు.