ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముగ్గురు అరెస్ట్​

నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముగ్గురిని ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

fake Aadhaar cards in Adoni
నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న మూగ్గురు అరెస్ట్​

By

Published : Nov 4, 2020, 10:00 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెట్టేకల్లు గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనికిలు చేశారు. ఈ క్రమంలో రేషన్ డీలర్ ఇంట్లో నకిలీ కార్డులు తయారు చేస్తున్నారని గుర్తించి... అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కంప్యూటర్ పరికరాలను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి...పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ...

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి కుమారుడు మృతి

ABOUT THE AUTHOR

...view details