ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి... ఆరుగురికి గాయాలు - accident news in kurnool district

రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు.

three persons killed in different accidents in ap
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

By

Published : Mar 27, 2021, 5:53 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం వామసముద్రంకు చెందిన రాజ్ కుమార్, ఉయ్యాలవాడకు చెందిన శివకుమార్ మృతి చెందారు.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్దాంతం లో బైక్ నుంచి జారీ పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పెడన మండలం దేవరపల్లికి చెందిన సమ్మెట వెంకటేశ్వర రావు(52)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం గొంది జ్యోతినగర్​లో కారు బోల్తా కొట్టింది.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

బొప్పూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details