కర్నూలు జిల్లా నంద్యాల 12వ వార్డు ఆదర్శనగర్లో నగదు, బంగారం పంపిణీ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బిర్యానీలో ముక్కుపుడక పెట్టి ఓటర్లకు పంచుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు.. రూ. 52వేలు నగదు, 23 ముక్కుపుడకలను స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఓబులేసు తెలిపారు.
ప్రలోభాల జోరు... నంద్యాలలో ముగ్గురు అరెస్టు - nandyala latest news
పురపాలక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ముక్కుపుడకలు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురిని అరెస్టు చేసి, డబ్బు, ముక్కు పుడకలు స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాలలో ముక్కుపుడకలు పంచుతున్న ముగ్గురు అరెస్టు