ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి' - అర్చకులపై దాడులు చేయటంపై తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి ఘటనపై.. తెదేపా ఆందోళన వ్యక్తం చేసింది. అర్చకులపై ఆలయ ఛైర్మన్, ఈవో.. చర్నాకోలాతో దాడి చేసి దారుణంగా గాయపరిచారని ఆరోపించారు. భాజపా నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Those who attacked priests should be arrested at kurnool district
'అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి'

By

Published : Dec 1, 2020, 3:34 PM IST

కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడుల ఘటన దారుణమని తెదేపా ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన ఓంకారం ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో వైశ్యులు, బ్రహ్మణులకు రక్షణ లేకుండా పోతోందని... కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

భాజపా నేతలు ఆగ్రహం

అర్చకులపై చర్నాకోలాతో దాడి చేసి దారుణంగా కొట్టిన ఆలయ ఛైర్మన్, ఈఓలను వెంటనే అరెస్ట్ చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామస్వామి డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో వైకాపా పాలనలో హిందూ దేవాలయాలు, సమాజంపై దాడులు పెరిగాయన్నారు. తుంగభద్ర పుష్కరాలకు ప్రభుత్వం 250కోట్ల రూపాయలు ఖర్చు చేసి నదిలో స్నానానికి అనుమతి ఇవ్వకపోవటం సరికాదన్నారు.

ఇదీ చదవండి:

సాయంత్రం హారతితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు

ABOUT THE AUTHOR

...view details