కుందూ నదిలో నీటి ప్రవాహాన్ని తగ్గించాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ నది పరివాహక గ్రామాల్లో ఒకటైన తొగర్చేడుకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందు వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఆవేదన చెందారు.
ఎగువ ప్రాజెక్టుల నుంచి సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేస్తున్నారని రైతులు అన్నారు. ప్రస్తుతం కుందూ నదిలో ఇరవై వేల కూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగుతోందని చెప్పారు. పై నుంచి నీటి విడుదల నియంత్రించి.. తమ పొలాలు కాపాడాలని అధికారులను కోరారు.