కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ముగ్గురు హిజ్రాలు మద్యం కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా... వంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 69 మధ్యం సీపాలు లభ్యమయ్యాయి. హిజ్రాలను అడ్డుపెట్టుకొని ఆటో డ్రైవర్ మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గ్రహించిన అధికారులు... ఆటోడ్రైవర్ మధుగోపాల్ను అరెస్టు చేశారు.
ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హిజ్రాలు... డ్రైవర్‌ను, ఆటోను వదిలిపెట్టి తమపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. తమ పరిధిలో ఏమీలేదని ఉన్నతాధికారులు చెప్పడంతో... హిజ్రాలు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులు ఆంక్షలు వివరించి హెచ్చరించటంతో నిరసన విరమించారు.