వీడియో సందేశం ఇస్తున్న తిక్కా రెడ్డి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దౌర్జన్యాన్ని ఇప్పుడు నివారించలేకపోతే ఇంకెప్పుడూ ఆపలేమని తిక్కారెడ్డి అన్నారు. నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, ఖగ్గల్లు గ్రామంలో జరిగిన దాడిలో గాయడపడిన తిక్కా రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుంచి తిక్కారెడ్డి వీడియో సందేశాన్ని ఇస్తూ ప్రచారంలో ఉండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు, కుటుంబ సభ్యులు అన్యాయంగా దాడి చేశారని వాపోయారు. గతంలో 20 వేల మెజారిటీ వస్తుందని చెప్పాం... ఇప్పుడు 50 వేల మెజారిటీతోఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బాధను దిగమింగుకుని ప్రచారంలో పాల్గొంటామన్నారు. కార్యకర్తలు ఎవ్వరూఉద్వేగానికి లోనుకావద్దని శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలని సూచించారు.