కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీ, కుమార్తెపై ముసుగు దొంగలు దాడి చేశారు. గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కూతురిని ఇంటికి తీసుకెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కొట్టి కుమార్తె మెడలోని బంగారు గొలుసు, బ్యాగు లాక్కెళ్లారు. గాయపడిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి - ముసుగు
ముగ్గురు దొంగలు. ముఖాలకు ముసుగు వేసుకుని దారి కాచారు. ఆ రోడ్డులో వస్తున్న తండ్రీ కుమార్తెలపై దాడి చేసి బంగారు గొలుసు, బ్యాగు ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు వద్ద జరిగింది.
దోపిడీ దొంగల బీభత్సం..