కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోయారు. ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దుండగులు మూడు ఇళ్లల్లోంచి మూడు తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు, రెండు బైకులు దొంగలించారు. మరో రెండు ఇళ్లల్లో చోరీలు జరిగినప్పటికీ.. ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవటం ఎంతమేర నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు - కర్నూలులో తాళాలు వేసున్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు తాజా వార్తలు
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. వరుసగా మూడు ఇళ్ల తాళాలను పగలగొట్టి మూడు తులాల బంగారం, రూ.50 వేల నగదు, రెండు బైకులు అపహరించారు.

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రెచ్చిపోయిన దొంగలు
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రెచ్చిపోయిన దొంగలు
ఇవీ చూడండి...