ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి అని నమ్మబలికి ..చనిపోయిన వ్యక్తినుంచి నగదు అపహరణ - నంద్యాల బస్టాండులో దొంగతనం

మోసాలకు అలవాటుపడిన ఓ దొంగ .. మరణించిన వ్యక్తి నుంచి డబ్బులు దొంగతనం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. బస్టాండ్​లో ఓ వృద్ధుడు చనిపోతే అతని వద్దనుంచి డబ్బులు కాజేేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు ఆ దుండగుడిని అడ్డుకున్నారు. మృతుడు తన తండ్రని వాళ్లకి మాయ మాటలు చెప్పి... అంబులెన్స్ తీసుకువస్తా అని రూ. 1500 తీసుకుని ఉడాయించాడు.

Breaking News

By

Published : May 11, 2021, 11:31 PM IST

పట్టపగలు అందరినీ నమ్మించి.. బస్టాండ్​లో చనిపోయిన ఓ వృద్ధుడి నుంచి రూ.1500 దోచుకెళ్లాడో దొంగ. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ సంఘటన జరిగింది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్​లో వెంకటేశ్వర్లు అనే 60 ఏళ్ల వృద్దుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి చెందక ముందు దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి చేరాడు. అతని వద్ద ఉన్న డబ్బులను గమనించి…వాటిని కాజేయాలని చూశాడు. అప్పటికే ఆ వృద్ధుడు హఠాత్తుగా మరణించాడు. అతని వద్దనున్న రూ.9,500 నగదును ఈ దుండగుడు తీస్తుండగా..స్థానికులు చూసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు తన తండ్రి అవుతాడని వారికి మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. ఈ విషయాన్ని ఆర్టీసి సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు అతను తన తండ్రి అని అంబులెెన్స్​ తీసుకురావాలని వారికి అబద్ధాలు చెప్పి రూ. 1500 ఇవ్వాలని కోరాడు. వారు అతనిని నమ్మి ఇవ్వగా.. దుండగుడు డబ్బులతో ఉడాయించాడు. . ఎంతకీ రాకపోవడంతో అప్పటికే సమాచారం అందుకున్న బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 8,000 అక్కడి సిబ్బంది బంధువులకు అందజేశారు. స్థానికులు దొంగ ఫోటో తీశారు. మృతుడు వెంకటేశ్వర్లు బనగానపల్లె మండలం ఫలుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. తరుచూ బస్టాండు ప్రాంతంలో తిరిగేవాడు.

ABOUT THE AUTHOR

...view details