ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్దుడు వద్ద బంగారు గాజులను ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్ - నంద్యాలలో బంగారు గాజుల దొంగ అరెస్ట్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనెల 17న ఓ వృద్దుడి వద్ద బంగారు గాజులను ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను అరెస్ట్ చేశామని రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

thief have been  arrested stealing gold bangles at old man in nandyala
వృద్దుడు వద్ద బంగారు గాజులను ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్

By

Published : Jun 28, 2020, 10:49 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సుబ్బరాయుడు అనే వృద్ధుడి వద్ద బంగారు గాజులను అపహరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన సుబ్బరాయుడు బ్యాంకు రుణం కోసం ఈ నెల 17న నంద్యాలకు వెళ్లాడు. అక్కడే ఉన్న నంద్యాల సరస్వతీనగర్​కు చెందిన రఫీ అనే వ్యక్తి.. మీ కుమారుడి స్నేహితుడినంటూ సుబ్బరాయుడును పరిచయం చేసుకున్నాడు.

వృద్ధునితో మాటలు కలిపి.. రుణానికి పెట్టే బంగారు గాజులను చూపెట్టమని రఫీ అడిగాడు. బాధితుడు నిరాకరించటంతో బలవంతంగా చేతిలో ఉన్న గాజులను లాక్కొని వెళ్లాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details